అంగన్వాడి సెంటర్లో బతుకమ్మ ఉత్సవాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 1( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆసుపాక కాలనీ అంగన్వాడి సెంటర్ లో ఆర్కే ఎం లక్ష్మి చిన్నారులతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఆసుపాక కాలనీ లో శనివారం చిన్నారులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడి ఆడారు. ఈ కార్యక్రమంలో టీచర్లు ఆయాలు తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.