అంగారకుడి నుండి తొలిసారిగా శబ్ధం

రికార్డు చేసిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌
వాషింగ్‌టన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల అంగారకుడిపైకి పంపిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ ఆ గ్రహంపై గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నవంబరు 26న మార్స్‌పై విజయవంతంగా దిగింది. అక్కడికి చేరిన తర్వాత పరిసరాల్లోని ఫొటోలు పంపింది. అయితే తొలిసారిగా అంగారకుడిపై గాలి శబ్దాలను రికార్డు చేయగలిగిందని నాసా వెల్లడించింది. గాలులు బలంగా వీస్తున్న తరంగాలు ఇన్‌సైట్‌ ల్యాండర్‌లో నమోదయ్యాయని, ఇన్‌సైట్‌ సోలార్‌ప్యానెల్స్‌ పై నుంచి గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు రికార్డైరదని తెలిపింది.స్పేస్‌క్రాప్ట్‌లోనిరెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని.. ఇన్‌సైట్‌ లోపల ఉన్న గాలి పీడన సెన్సార్‌, ల్యాండర్స్‌ డెక్‌పై ఉన్న సెస్మోవిూటర్‌ సెన్సార్లలో అవి రికార్డయ్యాయని నాసా స్పష్టంచేసింది. అందులో నమోదైన శబ్దాలు గాలిలో జెండా ఎగురుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు థామస్‌ పైక్‌ వెల్లడించారు. అంగారక గ్రహంలోని రాతి పొరల నిర్మాణాలను పరిశోధించడానికి, అక్కడి భూ కంపాలు తదితర విషయాలను తెలుసుకోవడానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు.