అంతర్జాతీయ విమాన సర్వీసులు చేసిన పాకిస్తాన్

పారి): ఇస్లామాబాద్,మార్చి 21(జనంసాక్షి): అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నాటికి దేశంలో 625 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ముగ్గురు మృతిచెందారు. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో అధికంగా కరోనా లక్షణాలు కనిపించాయి. వైరస్ వ్యాపిని అరికట్టడానికి శనివారం రాత్రి 8 గంటల నుంచి పాకిస్థాన్ లోకి అంతర్జాతీయ విమానాల ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి పాక్ చేరుకొనే పాకిస్థాన్ ఎయిర్ లైన్స్, కార్గో సేవలందించే విమానాలకు మినహాయింపునిచ్చారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు దేశంలో నడుస్తున్న రైళ్ల సర్వీసుల సంఖ్యను తగ్గించాలని రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. దేశంలో 34 రైళ్లను నిలిపివేశాం, మరో 8 రైళ్లను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తామని రషీద్ అహ్మద్ తెలిపారు. రావల్పిండిలోని అడియాలా జైలులోని విచారణ ఖైదీలను విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేయవద్దని పోలీసులకు కోర్టు సూచించిందని డాన్ పత్రిక పేర్కొంది. కరోనాను ఎదుర్కొనేందుకు 40 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు నిధులను వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. శు క్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరోనా వ్యాప్తి పేరుతో పూర్తిగా లాక్ డౌన్ చేసే పరిస్థితి లేదన్నారు. ‘పాకిస్థాన్ ఇటలీ వంటి ధనిక దేశం కాదు. ఆర్థిక కార్యకలాపాలు లేకుండా దేశ ప్రజలు జీవించలేరు’ అని పేర్కొన్నారు.