అందరికీ ఒకే విద్య అమలు కావాలి 

విద్యారంగానికి కేటాయంపులు పెరగాలి
హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి):రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలని  తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ  డిమాండ్‌ చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ బిల్లు ఉన్నత విద్యారంగానికి గొడ్డలి
పెట్టు వంటిదని అన్నారు. రెండు దశాబ్దాలుగా వర్సిటీల్లో నియామకాల్లేవన్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా వ్యవస్థను నియంత్రించ కుంటే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అసాధ్యమన్నారు. పాలకవర్గాలు ప్రసార మాధ్యమాలను గుప్పిట్లో ఉంచుకుని తమ అభిప్రాయాలను, నిర్ణయాలను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం సరికాదని విద్యావేత్తలు అన్నారు. పేద, ధనిక తేడా లేకుండ అందరికీ సమాన విద్య కోసం కలసి పోరాడాలని  పిలుపునిచ్చారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హవిూని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వ వర్సిటీలను బలోపేతంచేయాలని పేర్కొన్నారు.  రాష్ట్రంలో విద్యకు కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయించా లన్నారు. మరోవైపు  ఇంగ్లిషు విూడియానికే తల్లిదండ్రులు జై కొడుతుండటం.. ప్రైవేటు ఉద్యోగావ కాశాల్లోనూ గణనీయ ప్రాధాన్యం ఉండటంతో రాష్ట్రంలో ఇంగ్లిషు విూడియం విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తెలుగు విూడియం విద్యార్థులు తగ్గిపోతున్నారు. అందుకే గల్లీగల్లీకి ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు పెరగుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యతగ్గుతోంది. కెజి టూ పిజి విద్యకు సిఎం కెసిఆర్‌ ప్రణాళిక రచించినా అది కార్యరూపం దాల్చకపోవడంతో ప్రైవేట్‌ స్కూళ్ల హవా కొనసాగుతోంది. ఇంగ్లీష్‌కు ఆదరణ అన్నది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. మోడల్‌ స్కూళ్లలో సీట్లు పెరగటం, కొత్త స్కూళ్లకు అనుమతులు రావడంతో ఇంగ్లిషు విూడియం విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది.