-అందరూ ఉత్తనేనా…? ఉత్తమ ఉపాద్యాయులు జిల్లాలో లేరా..?

-సంఘ నాయకులాకా ఆత్మవిమర్శ చేసుకోండి

-లోక్‌సత్తా వినతి

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాద్యాయుల జాబితాలో కరీంనగర్‌ జిల్లానుంచి ఒక్కరైనా లేకపోవడం ఆశ్చర్యకరం విచారకరమని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పేర్కొంది. 31 జిల్లాల్లో దాదాపు పది జిల్లాలనుంచి ఒక్కరికైనా రాలేదని ఎంపిక ప్రక్రియపై ఉపాద్యాయ సంఘాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని లోక్‌సత్తా కోరింది. స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీకి చెందిన కె రాంచంద్రారెడ్డికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యదిక మార్కులతో జిల్లానుంచి ప్రతిపాదనలు పోయాయని అయినా ఎంపిక కమిటీ పరిశీలించకపోవడం దురదృష్టకరమని లోక్‌సత్తా పేర్కొంది. రాష్ట్రంలో అత్యదిన నూతన అడ్మిషన్‌లు ఉన్న పాఠశాలగా రామకృష్ణ కాలనికి గుర్తింపు ఉందని దానికిబాద్యులు రాంచంద్రారెడ్డి అని లోక్‌సత్తా పేర్కొంది. అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలని రాజకీయ నిర్ణయాలతో వృత్తిలో ఉన్నవారు నిస్పృహకు గురవుతున్నారని ప్రభుత్వం ఇది గమనించి నిపుణులతో ఎంపిక చేసేందుకు కొత్తగా మార్గదర్శకాలు రూపొందించాలని లోక్‌సత్తా జిల్లా బాద్యులు ఎన్‌ శ్రీనివాస్‌, ప్రకాశ్‌, చంద్రప్రభాకర్‌, నారాయణ గంగాదర్‌ ముజఫర్‌ మనోహర్‌లు కోరారు

సహ కవిూషనర్లను నియమించాలి

తెలంగాణా రాష్టాన్రికి ప్రత్యేక సమాచార హక్కు కవిూషనర్లను వెంటనే నియమించాలని అటు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నలుగురు కవిూషనర్లు సిబ్బందిని నియామకానికి జీఓ .జారీ చేసిందని లోక్‌సత్తా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.