అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం

76 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి): పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చ్టువల్‌ విధానం ద్వారా ప్రారంభిం చారు. ఈ ప్లాట్లను న్యూఢిల్లీ లోని డాక్టర్‌. బి.డి.మార్గ్‌లో కట్టారు. 80 ఏండ్లు పైబడిన ఎనిమిది పాత బంగళాలకు చెందిన భూమిలో ఈ 76 ప్లాట్‌ లను నిర్మించారు.’ఎంపీల గృహ వసతి చాలా కాలంగా పరిష్కారం కాకుండా అలాగేఉంది.దానిని ఇప్పుడు పరిష్కరించడం జరిగిందని ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. దశాబ్దాల నాటి సమస్యలను తప్పించుకు తిరిగితే సమసిపోవు, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తేనే అవి కొలిక్కి వస్తాయి అని ఆయన అన్నారు. చాలా సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఢిల్లీలో అనేకం ఉన్నాయి, వాటిని ఈ ప్రభుత్వం చేపట్టి అనుకున్న కాలాని కంటే ముందుగానే పూర్తి చేసిందన్నారు. వాటిని ఒక దాని తరువాత మరొకటిగా ఆయన ప్రస్తావించారు. చాలా కాలం పాటు పరిష్కారం కాకుండా ఉన్న కేంద్రీయ సమాచార సంఘం కొత్త భవనాన్ని, ఇండియా గేట్‌ సవిూపంలో యుద్ధ స్మారకాన్ని, జాతీయ రక్షకభట స్మారకాన్ని ఈ ప్రభుత్వం నిర్మించిందని ఆయన అన్నారు.