అందువల్లే నేను మంత్రిని కాగలిగాను: కేటీఆర్

హైదరాబాద్: అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడినందువల్లే నేను మంత్రిని కాగలిగానని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని ఎన్ఏసిలో డిఐసిసిఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్ డెవలప్ మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన డా. బీ.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ టెండర్స్ లోని అన్ని శాఖల్లోనూ 50% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేయూతనిస్తుందని, రాజ్యాంగం శరణం ఘచ్చామి అనేది అందరూ పాటించాలని మంత్రి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో టెండర్స్ పొందిన పలువురు ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన ధృవీకరణ పత్రాలు అందజేశారు.