అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి )కోహీర్ మండల కేంద్రంలోని కొత్తూర్(కే) గ్రామంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను గ్రామానికి చెందిన భవాని మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు మరియు యువతుల సహకారంతో ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు.తెలంగాణ పండుగైన బతుకమ్మను తంగేడు,గునుగు పూలతో అలంకరించి,మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించేలా ఆటపాటలతో బతుకమ్మను పూజిస్తూ ఆడపడుచులంతా భక్తిని చాటుకున్నారు. గ్రామంలో జరిగిన బతుకమ్మ పండుగ మహోత్సవంలో గ్రామానికి చెందిన మహిళలు యువతులు సింధు,,కృష్ణవేణి,శ్రావణి,భవాని,మల్లేశ్వరి,అనిత,మౌనిక,స్వప్న,అక్షిత,పూజ,నిర్మల,భవాని మాత యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు