అక్రమ కలపస్వాధీనం

ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా

నిర్మల్‌,జనవరి14(జ‌నంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై కోరడా ఝళిపిస్తున్నారు.నిర్మల్‌ జిల్లా పెంబి అటవీ రేంజ్‌ పరిధిలోని ఇటిక్యాల్‌, లోతోర్యతండా, తులసీపేట్‌ గ్రామాల్లో నిర్మల్‌ డీఎఫ్‌ దామోదర్‌ అటవీ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇండ్లు, ఇంటి ఆవరణలల్లో అక్రమంగా నిల్వ చేసిన కలప, కోత మిషన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ దామోదర్‌ మాట్లాడుతూ..పట్టుబడ్డ కలప విలువ సుమారు రూ. రెండు లక్షల వరకు ఉంటుందని, కలపను పెంబి రేంజ్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వన్య ప్రాణులను వేటాడినా, చెట్లను నరికినా, ఇసుక అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కలపతో వస్తువులను తయారు చేసినా, కోత మిషన్లు వినియోగించినా చర్యలు తీసుకుంటామన్నారు.