అక్రమ నిర్మాణాలు కూల్చివేత

26brk-127aహైదరాబాద్‌: ఆక్రమణలకు గురైన నాలాలపై నిర్మాణాలు కూల్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ యంత్రాగం కదిలింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన నాలాలను సోమవారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లి, మదీనాగూడ, గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు ఉన్న నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. అలాగే ఉప్పల్‌ పరిధిలోని స్వరూప్‌నగర్‌ మూసీ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేశారు. ఇక్కడి నాలాను కొందరు ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారం రోజులుగా కురిసిన వర్షానికి స్వరూప్‌నగర్‌, బ్యాంకు కాలనీ, అన్నపూర్ణ కాలనీలు ముంపునకు గురయ్యాయి. దీనికి కొనసాగింపుగా రామంతాపూర్‌, చిలుకానగర్‌, హబ్సిగూడలోని నాలాలపై నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు పట్టణ ప్రణాళిక అధికారి నాగిరెడ్డి తెలిపారు.
సిటీలో వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కేటీఆర్ రివ్యూ చేశారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాల్టీల్లో చెరువులు, నాలాల పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. మరోవైపు శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుద్ధ్య చర్యలకు ఆదేశించారు. మున్సిపల్ అధికారులు విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేటీఆర్.

మంత్రి ఆదేశంతో మున్సిపల్, బల్దియా ఆదేశాలపై సిటీలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేశారు అధికారులు. రాజధానిలో నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గచ్చిబౌలి నుంచి కొత్తగూడ వరకు అక్రమ నిర్మాణాలను నజర్ పెట్టింది ప్రభుత్వం. సిటీలో 30కి పైగా టీమ్ లు రంగంలోకి దిగాయి. 24 సర్కిళ్లలో  అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతోంది.