అఖండ విజయం సాధించి తీరుతాం

కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

షబ్బీర్‌ అలీ ధీమా

కామారెడ్డి,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లోని కాంగ్రెస్‌ జెండా ఎగరేయడమే గాకుండా తెలంగాణలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీమంత్రి షబ్బీర్‌ అలి అన్నారు. తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలతోనే ఓటమిని అంగీకరించారని వివరించారు. తప్పుడు హావిూలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత తెలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రంలో అహంకార, కుటుంబ పాలనను గ్దదెదింపేందుకు కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, సీపీఐ, జనసమితి పార్టీలతో జతకట్టిందని షబ్బీర్‌అలీ అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పింఛన్లు ఆగిపోతాయంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పింఛన్‌దారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొడతామన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని,తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపైనే టీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేశారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయమాటలకే పరిమిత మయ్యారని మాజీ మంత్రి విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో

ప్రజాకూటమి అభ్యర్థులు అఖండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.