అగ్ని-5 క్షిపణిని ప్రయోగించిన భారత్‌

న్యూఢిల్లీ: భారత్‌ గురువారం ఉదయం అణ్వాయుధ సామర్థ్యంగల అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం దీవుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. 2016 డిసెంబర్‌ 26న అగ్ని-5 క్షిపణీ నాలుగో దఫా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్షిపణినీ విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్రువీకరించారు. గురువారం అగ్ని-5 క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించి చూసినట్టు తెలిపారు.