అగ్రికల్చర్‌ వర్సిటీ ఏర్పాటుకు సిద్దం: మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): జిల్లాలో త్వరలో అగ్రికల్చర్‌ కాలేజీ, మరాఠి జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.3,730 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు గానీ ఆదిలాబాద్‌ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రులుగా చేసిన వారు గానీ వేలాది కోట్లు ఎందుకు మంజూరు చేయించలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ పనులు సహా పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి జోగు రామన్న తెలిపారు.సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో ఇచ్చిన రూ.250 కోట్ల నిధుల హావిూ మేరకు 75 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి జోగురామన్న.బేల మండలంలో మంత్రి జోగు రామన్న పర్యటించారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటమునిగిన పంటపొలాలను పరిశీలించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లే ఇబ్బందిగా ఉన్న లో లెవల్‌ వంతెన స్థానంలో హై లెవెల్‌ వంతెన నిర్మాణం పనులు చేపడతామని హావిూ ఇచ్చారు.