అచ్చంపేటకు లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు


ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ హావిూ
నాగర్‌కర్నూల్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): అచ్చంపేట నియోజకవర్గానికి లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్‌ ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. అచ్చంపేట నియోజకవర్గం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం. నీళ్లు తేవడానికి నేను చేస్తోన్న పంచాయితీ విూకు తెలుసు. అచ్చంపేటకు లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. త్వరలోనే ఆ కల సాకారం కాబోతోంది. డిండి, కల్వకుర్తి
ఎత్తిపోతల పథకం ద్వారా నీరు తీసుకువస్తాం. తద్వారా లాభం జరుగుతుంది. విూ దీవెనతో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు.కారు గుర్తుకు ఓటేసి గువ్వల బాలరాజును గెలిపించండి. బాలరాజు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి.. బ్రహ్మాండమైన ఎకో టూరిజం ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం ఎవరి హక్కు కాదు. అందులో మన సొత్తు కూడా ఉంది. చేపల పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తాం. అధునాతనమైన మరబొట్లను కూడా తీసుకువస్తాం. ప్రభుత్వం ఏర్పడ్డాక అచ్చంపేటకు నేను వచ్చి అన్ని సమస్యలపై చర్చించి కోరికలన్నీ నెరవేరుస్తాం. బాలరాజును బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.