అచ్చోసిన ఆంబోతుల్లా..  వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు

– సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
– వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని సందర్శించిన లోకేశ్‌
అమరావతి, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :  వైసీపీ కార్యకర్తలు అధికార మదంతో అచ్చొచ్చిన ఆంబోతుల్లా ప్రజల
పట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని /ఖడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా లోకేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి విూ కార్యకర్తలు, నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల విూద పడి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా విూరేమో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారంటూ ఆరోపించారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం మౌనం పాటిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారని, అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 100 రోజులు ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని హెచ్చరించారు. పిన్నెల్లిలో 200 మందిపై ఒక్కొక్కరి విూద నాలుగు అక్రమ కేసులు పెట్టారని అన్నారు. వైసీపీ నీచ రాజకీయ కక్షలకు టీడీపీ సానుభూతిపరులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోందని, వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చామని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10వేలు ఆర్థికసాయంగా అందిస్తున్నామని, వారి పిల్లలకు ఉన్నత విద్య అందిస్తామని వెల్లడించారు. గ్రామాలను వీడిన వారికి రక్షణ కల్పించాలని, ఈ నెల 11 నాటికి తిరిగి వారిని గ్రామాల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రక్షణ కల్పించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.