అటవీభూముల్లో మొక్కల పెంపకం

అడవులను నరికితే కఠిన చర్యలు
హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలి
యాదాద్రి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): అటవీ భూముల్లో మొక్కల పెంపకానికి ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. హరితహారం ద్వారా ప్రభుత్వం చెట్ల పెంపకానికి పకడ్బందీగా చర్యలు చేపడుతుందన్నారు. చెట్లను నరికివేసిన వారిపై కఠినతీసుకుంటామన్నారు. చెట్లను ఎవరూ నరకవద్దని వంటలకు వంటగ్యాస్‌ను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెట్ల పెంపకం ద్వారానే పర్యావరణ పరిరక్షణ చేకూరుతుందని ప్రతిఒక్కరూ చెట్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల ఆయన పలువురు గ్రామస్తులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణంలో వీరారెడ్డిపల్లి, ఎన్‌జి.బండల్‌ గ్రామాల పరిధిలోని అటవీ భూములు ముంపునకు గురౌవుతున్నాయన్నారు. రిజర్వాయర్‌ ముంపులో చెట్లు కోల్పోనున్నాయన్నారు. మిగిలిన అటవీ భూముల్లో మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇదిలావుంటే  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలో 2.48 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా  అధికారులు ముందుకెళ్తున్నారు. 401 పంచాయతీల్లో 401 నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 2.48 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యం గా పక్కాఎ/-లాన్‌ అధికారులు ముందుకు వెళ్తున్నారు.  ప్రజలనూ భాగస్వాములను చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా విజయవంతంగా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. గతేడాదిలా కాకుండా ఈసారి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసి ఆ నర్సరీలోనే పంచాయతీలో, మండలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇతర మండలాల నుంచి మొక్కలను తీసుకువచ్చి మొక్కలు నాటేలా కాకుండా ప్రతి గ్రామ పంచాయతీ ఖచ్చితంగా ఒక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచే బాధ్యతను అప్పగించారు. దీంతో ఈ ఏడాది ఒక గ్రామ పంచాయతీకి- ఒక నర్సరీ ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై – ఆగష్టులో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు 2.48 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రజలను అత్యధికంగా భాగస్వాములను చేయడం సాధ్యమవుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. టేకుతో పాటు వెదురు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి, కర్జూరం, నిద్రగన్నేరు, మల్బర్‌ వేప, కానుగ, వేప, కదంబ, గుల్‌ మారేడు, స్పాంథోడియా, కరివేపాకు, గోరింట, ఉసిరి, చింత, రేగు, ఈత, నేరేడు తదితర మొక్కలు ఈ నర్సరీలో పెంచనున్నారు. ఒక్కో నర్సరీలో ఒక వనసేవకుడితో పాటు 10 నుంచి 15 మంది ఉపాధిహావిూ కూలీలను నియమించి ఈ మొక్కల పర్యవేక్షణను చేపట్టనున్నారు.  ఎలాంటి వాతావరణంలోనైనా ఈ టేకు మొక్కలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందునే టేకు మొక్కలను పెంచనున్నది.