అటు అసెంబ్లీ ఫలితాలు..ఇటు పార్లమెంట్‌ సమావేశాలు

 

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): డిసెంబర్‌ 11 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంట్‌ వ్యవహారాల కమిటీ (సీసీపీఏ) సమావేశమై..పార్లమెంట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు డిసెంబర్‌ 11 నుంచి జనవరి 8 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ప్రారంభమవుతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు ఆలస్యం ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 11నే ఫలితాలు వెల్లడి కానున్నాయి.