అణుమంత్రానికి శాంతిమంత్రంతో విరుగుడు

కిమ్‌ను కర్తవ్యోన్ముఖుడిగా మార్చిన ట్రంప్‌

సింగపూర్‌ వేదికగా అమెరికాత,దక్షిణకొరియాల శాంతి చర్చలు

చర్చలు ఫలప్రదం అయ్యాయన్న ఇరు దేశాధినేతలు

ఆసక్తిగా గమనించిన ప్రపంచ దేశాలు

సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి): గతం గత్ణ.. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం..అణుముప్పు నుంచి బయటపడదాం ..శాంతికి బీటలు వేద్దామన్న ఆకాంక్షలతో అమెరికా, ఉత్తరకొరియాల మధ్య చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచానికి సవాల్‌ విసిరిన దక్షణ కొరియా అధ్యక్షుడు కిమ్‌ను శాంతి చర్చలతో అమెరికా బుట్టలో వేసుకుంది. అణుముప్పు నుంచి శాంతి దిశగా దక్షిణ కొరియాను తీసుకుని రావడంలో అమెరికా విజయం సాధించింది. కిమ్‌తో భేటీ ద్వారా ట్రంప్‌ శాంతి చర్చలకు బీజం వేశారు. ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినట్లుగానే సంగపూర్‌ వేదికగా చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఇరు దేశాధ్యక్షుల మధ్య కీలక సమావేశం జరిగింది. అత్యంత అరుదైన ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా ¬టల్‌ వేదికగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు దాదాపు 38 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తరకొరియా భద్రతకు హావిూ ఇస్తామని అమెరికా తెలిపింది. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. కిమ్‌తో జరిగిన ఈ భేటీ ‘వెరీ వెరీ గుడ్‌’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సానుకూలంగా ఈ భేటీ జరిగింది. అందరూఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంది.’ అని ట్రంప్‌ అన్నారు. శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సింగపూర్‌ భేటీ సాకారమైందని.. ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు.తొలిసారిగా కలుసుకున్న సందర్భంగా ట్రంప్‌, కిమ్‌ కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ట్రంప్‌.. హాలువైపు కిమ్‌కు దారి చూపించారు. 1950-53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. కనీసం ఫోన్‌లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరు దేశాధినేతులు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సెంటోసా ద్వీపంలోని కెపెల్లా ¬టల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మంగళవారం ఉదయం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని తెలిపారు. అంతేగాక ఇకనుంచి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. అలాగే అణు నిరాయుధీకరణ దిశగా తొలి అడుగు పడిందన్నారు. రెండు దేశాల మధ్య పెద్ద సమస్యల పరిష్కారానికి ఈ చర్చలు ఉపయోగ పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాట్లాడారు. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అవరోధాలను అధిగమిస్తామని, ఈ చర్చలతో శాంతి దిశగా ఓ అడుగు ముందుకు పడిందని తెలిపారు.

ఇరుదేశాల మధ్య కీలక పత్రాలపై సంతకాలు

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య చారిత్రక సమావేశం సింగపూర్‌లో జరిగింది. సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు పలు కీలక పత్రాలపై సంతకం చేశారు. భేటీ అనంతరం సంయుక్త పత్రాలపై విూడియా సమక్షంలో ట్రంప్‌, కిమ్‌ సంతకాలు చేశారు. ‘మేం చాలా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేస్తున్నాం. ఉత్తర కొరియాతో ఇప్పుడు మా సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. కిమ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సమావేశంలో పలు అంశాలపై సానుకూలంగా పరిష్కార ఒప్పందాలు చేసుకున్నాం’ అని ట్రంప్‌ అన్నారు. ఇది ఓ చారిత్రక సమావేశం. గతాన్ని వదిలిపెట్టాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించాం. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు.’ అని కిమ్‌ పేర్కొన్నారు. అణు నిరాయుధీకరణ పక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ట్రంప్‌ చెప్పారు. కిమ్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తారా? అని విూడియా ప్రతినిధులు అడగగా.. తప్పకుండా.. అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. కిమ్‌ చాలా స్మార్ట్‌, విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు.