అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు
జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఎంపీ సీటు గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా అందించాలన్నారు.  ప్రతీ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి బూత్‌లో మెజార్టీ రావాలని అన్నారు.  శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో వివిధ పార్టీ నుంచి గెలుపొందిన అనేక మంది ఎమ్మెల్యే లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  టీఆర్‌ఎస్‌కు వచ్చే మెజార్టీ కంటే భువనగిరిలో అత్యధికంగా మెజార్టీ  రావాలన్నారు. కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. బూర గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ పాలనను మెచ్చి 88 సీట్లలో గెలిపించారని అన్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం  అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ అనేక ఘనవిజయాలు సాధిస్తుందన్నారు. దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాలన, అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక మార్పు సాధించారని, ఈ నేపథ్యంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం అవసరమన్నారు. దేశ పరిపాలనా విధానంలో మార్పులు రావడానికి టీఆర్‌ఎస్‌ కారణమవుతుందన్నారు.