అదుపుతప్పి బోల్తా పడ్డ కారు

మరో ఘటనలో కారులో మంటలు
రంగారెడ్డి,అక్టోబర్‌4  (జనంసాక్షి):  షాబాద్‌ మండలంలోని కుర్వగూడ గేట్‌ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే  మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బుద్వేల్‌ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై కారు నుంచి దిగి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇకపోతే అంబర్‌పేటలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోను కూడా బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు వరంగల్‌ జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.