అధికారుల పర్యవేక్షణ లోపం చౌకబియ్యం అక్రమ రావాణా

ఆదిలాబాద్‌,,నవంబర్‌16(జనం సాక్షి ): జిల్లా వ్యాప్తంగా ఆరు మాసాల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా, అనధికారంగా తరలింది లెక్కకు అందనంత ఉంటుందని  అంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నా అక్రమ రవాణా ఆడగం లేదు.  పేదలకు చెందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా తగ్గడం లేదు. లబ్ధిదారులకు సక్రమంగా సరకుల పంపిణీని పర్యవేక్షణ చేయాల్సిన మండల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు పాతుకుపోయాయి.  డీటీల సాయంతో నిత్యం తనిఖీలు చేస్తూ అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశాలపై నిఘా ఉంచామన్నా ఎక్కడా కానరావడం లేదు.  నిరుపేదల కడుపుకొట్టి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారనే దారుణం ఈ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. బజార్‌హత్నూర్‌, బోథ్‌ విూదుగా ఘన్‌పూర్‌ చెక్‌పోస్టు దాటి బియ్యం మహారాష్ట్రకు తరలుతోంది. స్థానికంగా ఉన్న వ్యాపారులు బియ్యాన్ని సేకరించి పాలిష్‌, ప్యాకింగ్‌ చేసి మళ్లీ విక్రయిస్తున్నారు. రేషన్‌ సరకుల ఇంటర్‌నెట్‌లో  కీ రిజిస్టర్‌ ఆధారంగా విడుదలవుతున్నాయని డీలర్లు అక్రమాలకు తెరతీస్తున్నారు. విూ సరకులు అన్‌లైన్‌లో రాలేదని లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టి, రేషన్‌ కార్డులను తీసుకుని సరకులను కాజేస్తున్నారు. వస్తువుల ధరల పట్టికలు ఏ రేషన్‌ దుకాణంలో కానరావు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రతి మాసం అన్ని దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉండగా, ఈ తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఎలక్టాన్రిక్‌ కాంటాలు రేషన్‌ దుకాణాల్లో లేకపోవడం వల్ల ప్రతి లబ్ధిదారులు 2 నుంచి 3 కేజీల బియ్యాన్ని కోల్పోతున్నారు.