అన్నదాతను గట్టెక్కించే ప్రయత్నం 

దేనికైనా ఒక అడుగంటూ పడితే పది అడుగులు ముందుకు సాగుతాం.రైతులను చల్లగా చూసుకుంటేనే మంనం ముద్ద తినగలుగుతాం. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ చెబుతున్నదే. ఆచరణలో చేసి చూపడంలో మాత్రం అందరూ విఫలం అయ్యారు. అన్నదాత అంటూ కీర్తిస్తూ..దేశానికి వెన్నముక అంటూ పొగడడమే తప్ప మరోటి జరగడం లేదు. కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు లూటీ అవుతున్నా అన్నదాతలను మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణలో సిఎం కెసిఆర్‌ మాత్రం ఓ పక్కా ప్రణాళికతో రైతుల బాగుకోసం తీసుకుంటున్న చ్యలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవిగా ఉన్నాయి.
రైతు సమన్వయ సమితి తొలి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు విషయాలు వెల్లడించిన తీరు చూస్తేనే వ్యవసాయరంగంపై ఆయన దార్శనికత కనిపిస్తుంది.  భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులతో సహా ఆర్థిక సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రకటించిన వివరాలు అన్నదాతకు భరోసా కలిగించేలా ఉన్నాయి. పెట్టుబడి కింద ఇస్తామన్న ఆర్థికా సాయాన్ని డెబిట్‌ కార్డుల రూపంలో ఇవ్వడం కూడా ముదవాహం. అలాగే రైతు సమన్వయ సమితుల ద్వారానే పంటల కొనుగోళ్లకు 12వేల కోట్లు కేటాయిస్తామని చేసిన ప్రకట కూడా ధాన్యం కొనుగోళ్లపై లక్ష్యాన్ని చూపేలా ఉంది. నిజానికి వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ఇప్పటికీ కూలీల సమస్య ఉంది. కరెంట్‌ సమస్య తీరినా పండించిన పంటలకు గిట్టుబాటు ధరనలు దక్కడం లేదు. ఎరువులు పురరుగు మందుల ధరలతో కుదేలవుతున్నారు. ఈ దశలో ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి లేఖలు కూడా రాశానని తెలిపారు. అటవీ శాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గిస్తం. సబ్సిడీపై సోలార్‌ ఫెన్సింగ్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌ తరాల కోసం మనం ఆలోచించాలని అన్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ జరిగితే తప్ప అనుకున్నది సాధించలేమని కూడా అన్నారు.  ఎక్కడ ఏ యంత్రాలు సమకూర్చాలో ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, అందరూ ఒకటే పంట వేస్తే అందరికీ నష్టం గునక పంటలు ఎప్పుడెలా ఎక్కడ ఎలా వేయాలో కూడా నిర్ణయిస్తామని అన్నారు. అధికారులు సూచించిన ప్రకారం పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవాలి.  తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లే రైతు సమన్వయ సమితిలో ఉన్నారని దీనిపై వస్తున్న విమర్శలకు  సమాధానంగా చెప్పారు.ఈ సారి రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు కూడా ప్రకటించారు. రైతు బాగుపడే వరకు చిత్తశుద్ధితో పని చేస్తామని, ఈ యాసంగి నుంచే రైతు సమన్వయ సమితులు చురుకుగా పనిచేసేలా చేస్తామన్నారు. ప్రస్తతుం ఎదుర్కొంటున్న సమస్యలనే సిఎం ప్రస్తావించారు. వాటిని ఎలా అధిగమించబోతున్నారో చెప్పారు. మార్కెట్‌ తెచ్చే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పంటను ఒకే సారి మార్కెట్‌కు తరలించకుండా చూసుకోవాలి. ప్రతి గ్రామ రైతులకు ఒక నిర్ణీత రోజు, సమయం కేటాయించాలి. వచ్చే వర్షాకాలపు పంట ఒక్క గింజ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మనివొద్దు. గిట్టుబాటు ధర రావాలంటే అది రైతుల చేతిలోనే ఉంది. నిమిషాల విూద కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. చెక్కుల పంపిణీలో క్రమశిక్షణ పాటించిన గ్రామాల రైతులను ఇజ్రాయెల్‌ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. స్థానికంగా ఎక్కడ ఏ పంటలు పండుతాయో అక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తం.
రైతులకు 75శాతం సబ్సిడీతో టార్పాలిన్లను ఇస్తం. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యుత్తమ రైతులుగా తీర్చిదిద్దుతం. అంకాపూర్‌ గ్రామాన్ని సమన్వయ సమితి సభ్యులంతా సందర్శించారు.  ఏ ఎకరంలో ఏ పంట పండుతుందో సమన్వయ సమితికి తెలియాలి. మనం అనుకుంటే తెలంగాణలో బంగారు పంటలు పండవా? అని అన్నారు.  రూ.12వేల కోట్లు రైతుల పెట్టుబడి కోసం వచ్చే బడ్జెట్‌లో కేటాయించబోతున్నట్లు ప్రకటించారు.  మన రైతులు పండించే విలువ రూ.లక్షా 25వేల కోట్లు ఉండబోతోంది. కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు.  సమన్వయ సమితి సరిగా ఉంటే కల్తీ చీడ పురుగులుండవు. రైతులకు కరెంట్‌, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అన్ని ఇస్తున్నట్లు ప్రటకించారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల ఎకరాల వ్యవసాయ నికర భూమి తేలింది. కోటి 32 లక్షల భూమి ఏ పంచాయతీ లేకుండా ఉన్నది. రైతులను ఆర్గనైజ్‌ చేయడం వల్ల చాలా విజయాలు సాధిస్‌తామని అన్నారు.  రైతులు వ్యవస్థీకృతమే పంట కాలనీలు కూడా సాధ్యమే. రైతులంతా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇవన్‌ఈన కూడా అమల్లోకి వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలు చేయూతను అందించాలి. రైతులు బాగుపడేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. రైతులు కూడా తమ భవిష్యత్‌ కోసం పంటలను వేయడం మొదలు, పురుగుమందులు వాడడం, అమ్మకాల వరకు తగుజాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యవసాయం పండగగా మారగలదు.