అన్నదానానికి అర్హత కేవలము ఆకలి మాత్రమే

-ప్రతి రోజు లక్ష మందికి  భోజనాలు ఏర్పాటు చేస్తు యజ్ఞంలా ముందుకు వెళ్తా
-ఎంజేబి ట్రస్టు అధినేత మద్దుల నాగేశ్వర్ రెడ్డి
మిరుదొడ్డి,సెప్టెంబర్18(జనంసాక్షి) కడుపునిండినవానికి నీవు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా లభించని పుణ్యం ఆకలికొన్నవానికి పచ్చది మెతుకులతోనైనా కదుపు నింపితే పుణ్యం వస్తుందని,నిరు పేదలకు కడుపునిండా భోజనం అందించడానికి ఎంజెబి ట్రస్ట్ కృషి చేస్తుందని,ఏంజేబీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. మిరుదొడ్డి మండల పరిధిలోని మోతే  గ్రామంలో మంగళవారం రోజున  రామలింగేశ్వర ఆలయ అభివృద్ధికి  రూ.1లక్ష 116 విరాళం  అందిస్తానని అర్చకులు రాజమనోహరశర్మకు హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు వృద్ధులకు చిన్నారులకు చేయూత కల్పిస్తామన్నారు.దుబ్బాక నియోజకవర్గలోని గ్రామ గ్రామాన నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసి,
సమాపంక్తి బోజనం చేశారు.ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చనే ఉద్దేశ్యంతో ఒక యజ్ఞంలా ముందుకు సాగుతానన్నారు.ప్రతి రోజు లక్ష మందికి  భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిరుపేదల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్ననని అన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అవకాశమిస్తే సేవ చేయడానికి మరింత ముందుకు వచ్చి సేవ చేస్తనని తేలిపారు. “సేవే నా లక్ష్యం ప్రేమ నా దైవం” అనే నినాదంతో ప్రతి గ్రామాల్లో  సేవ చేస్తానని,సేవ చేయడంవల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజెబి ట్రస్టు ప్రతినిధులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి,అంకం మధు.పెర్క మాధవ,అస్క స్వామి,పెద్ద లింగన్న గారి కిరణ్ ,మహేష్ ,మంచాల మల్లేశం. తదితరులు పాల్గొన్నారు