అభివృద్దిలో భాగస్వామ్యం కావాలి

కూటమికి ఓటేస్తే అభివృద్ది ఆగిపోతుంది

ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి

నల్లగొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ను ఓడించాలని విపక్షాలు ఎన్నికల్లో అనైతికత పొత్తును పెట్టుకున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి డిపాజిట్‌ గల్లంతుకావడం ఖాయమన్నారు. అభివృద్దిని చూసి ఆశీర్వదించాలని కోరారు. గెలిపిస్తే మరింత అభివృద్దిచేస్తానన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాల్లో ప్రజలు కోరుకున్న పాలననే కేసీఆర్‌ అందించారన్నారు. అధికారంలోకి రాగానే… ఆసరా పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016కు పెంచుతామన్నారు. రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు

పెంచుతామన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ప్రతినెలా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు చాలా కీలకమైనవన్నారు. మహాకూటమి నాయకులు చెప్పిన మాయమాటలను నమ్మి ఓటేస్తే మరో ఐదేండ్లు రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. ఎన్నికల తర్వాత ఫలితాలను చూసి మహాకూటమి దుకాణం బంద్‌ అవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌

అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్‌, బీజేపీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్ని వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించలేవన్నారు. కేసీఆర్‌ నాయకత్వమే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.

కూటమికి ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుందన్నారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలా ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.