అభివృద్ది చెందిన దేశాలకు టీకా పంపిణీ సమస్య

మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో సరఫరా చేయాలి

భారత్‌కు ఆక్స్‌ఫర్డ్‌ బెటరని అంచనా

న్యూఢిల్లీ, నవంబర్‌23 (జనంసాక్షి): కరోనా టీకాలకు సంబంధించి వరుస గా శుభవార్తలు వెలువడుతున్నాయి. ్గ/జైర్‌, మోడర్నాసంస్థల రూపొందించిన కరోనా టీకా సగటు సామర్థ్యం 95 శాతమన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫైజర్‌ టీకాతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపిణీ పరమైన సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ టీకా నిల్వ, రవాణాకు దాదాపు -70 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరమవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా సామార్థ్యానికి సంబంధించి ఆస్ట్రాజెనెకా సోమవారం నాడు కీలక ప్రకటన చేసింది. ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. క్లీనికల్‌ ట్రయల్స్‌ సమాచారంపై జరిపిన తొలి విశ్లేషణలో..వలంటీర్లలో సగటును 70 శాతం మందిని ఈ టీకా కరోనా నుంచి రక్షించినట్టు వెల్లడైంది. క్లీనికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా విషయంలో అధికారులు రెండు కరాల డోసుల వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇవ్వగా..టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. కరోనా టీకా డోసులకు సంబంధించి రెండో విధానంలో ఈ టీకా 62 శాతం సామర్థ్యం చూపినట్టు బయటపడింది. సగం డోసు వినియోగించగా టీకా సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆస్టాజ్రెనెకా ప్రతినిధి తెలిపారు. ఈ విధానం అత్యంత ప్రభావశీలమైనదని, టీకా విషయంలో ఇదే అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని పేర్కొన్నారు.మోడర్నా, ఫైజర్‌ టీకాలతో పోలిస్తే.. ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా రూపొందించిన మోడర్నా, ఫజైర్‌ టీకాలతో పోలిస్తే ఆక్సఫర్డ్‌ టీకా సగటు సామర్థ్యం కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ టీకా పంపిణీ సౌలభ్యం పరిగణలోకి తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్‌ టీకాయే భారత్‌ వంటి దేశాలకు అనువైనదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. సాధారణ రిఫ్రెజిరేటర్లలో కూడా ఆక్స్‌ఫర్డ్‌ టీకా నిలువ చేయగలగడం దీనికి కారణమని వారు అంటున్నారు. శీతలీకరణ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్సఫర్డ్‌ టీకాయే తగినదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు డోసులు కేవలం రూ. 1000లోపే లభ్యమయ్యే అవకాశం ఉంటడమనేది ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు సంబంధించి రెండో సానుకూల అంశమని వారు అంటున్నారు. కాగా.. ఈ క్లీనికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ దేశాల నియంత్రణ సంస్థలకు అందించి, తగు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.