అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌

నేతల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది
వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి  ) : నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ. కోట్ల నిధులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తూ.. పురోగతి పనులను అడ్డుకుంటున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి ఆరోపించారు. వీరికి రాజకయీం తప్ప మరో పనిలేకుండా పోయిందని మండిపడ్డారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం నర్సంపేటలోని సబ్‌ రిజిస్ట్రార్‌  కార్యాలయం నిర్మాణానికి చెందిన శిలాఫలకంవద్ద సీఎం కేసీఆర్‌, తన చిత్రపటాలకు పిండప్రదానం చేయడాన్ని తీవ్రంగా ఎండగట్టారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొంతి మాధవరెడ్డి నియోజకవర్గంలో 15 పనులు టెండర్లు తీసుకొని చేయకుండా వదిలేసిన శిలాఫలకాల వద్ద పిండప్రదానం చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డా.విద్యాసాగర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్‌, మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది వేతనాలను పెంచడం పట్ల తెరాస కార్మిక విభాగం, గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మిక సంఘం బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నర్సంపేటలో సీఎం కేసీఆర్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. పారిశుద్య కార్మికుల కనీస వేతనం 8500లకు పెంచుతూ సిఎంకెసిఆర్‌ నిరర్ణయించారు. దీంతో వీరంతా ఆనందం వ్యక్తం చేస్తూ కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆ సంఘాల బాధ్యులు యువరాజు, భారతి, కోటిలింగం, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.