అభివృద్ధి కెసిఆర్‌కు మాత్రమే సాధ్యం

కళ్లకు కట్టేలా యాదాద్రికి మహర్దశ : ఎమ్మెల్యే సునీత
యాదాద్రి,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  యాదాద్రి అభివృద్ధికి సంబంధించి మరింత స్పష్టత వచ్చిందని, ఈ ప్రాంతం భవిష్యత్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లనుందని ఆలేరు ఎమ్మెల్యే, విప గొంగడి సునీత అన్నారు.  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు యాదాద్రి అభివృద్దికి తీసుకుంటున్న చర్యల కారణంగా యాదాద్రి దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం కానుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు ఈ క్షేత్ర అభివృద్దికి పైసా కేటాయించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాతనే ఇప్పుడు సిఎం కెసిఆర్‌ సాహసోపతే నిర్ణయంతో ఆలయ పుర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు కళ్లకు కనపడుతున్నాయని అన్నారు. తాజాగా యాదాద్రిలో జరుగతున్న పనులను చూస్తుంటే ఓ మహాద్భుతం సాకారం కాబోతున్నదని అన్నారు. త్వరలోనే ఆలయం కనువిందు చేయనుందని అన్నారు. యాదాద్రిని అద్భుతమైన పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని కేసీఆర్‌ ప్రకటించి అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారని  అన్నారు. రాబోయే కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించాక, ఆమేరకు పనులు సాగుతున్నాయని అన్నారు.  యాదాద్రికి అభిముఖంగా గుట్టలతో కూడిన ప్రాంతాన్ని టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయినట్లు తెలిపారు. 850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్‌ సిటీ నిర్మాణాన్ని చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  మొదటిదశలో 250 ఎకరాల్లో చేపట్టాల్సిన పనులపై డిజైన్లు
ఖరారు చేసి పసనులను పురమాయించారు. టెంపుల్‌సిటీలో కాటేజీలు, ఉద్యానవనాలు, ఫుడ్‌కోర్టులు, పార్కింగ్‌ స్థలాలు, ఇన్ఫర్మేషన్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీకూడా ప్రతిపాదిత యాదాద్రి అభివృద్ధికి అదనంగా చేపట్టే పనులని సునీత అన్నారు. ఈ ప్రాంత వాసులుగా తాము గర్వపడుతున్నామని అన్నారు. యాదాద్రి జిల్లా దీంతో మరింత కొత్తరూపు సంతరించుకోనుందని అన్నారు. ఇదిలావుంటే యాదాద్రి విస్రతణ పనులు చేపట్టాక ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. యాదాద్రిని దర్శించుకోవడంతో పాటు పనులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న వారు వస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని ఉవ్వీళ్లూరుతున్నారు. ప్రతిరోజు నిర్వహించే నిత్యకళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగుతున్నాయి.