అభివృద్ధి పథంలో ఎడపల్లి

జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు
నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు పోటీ పడుతున్నాయని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు కషి చేస్తున్నారని ఆయన అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎడపల్లి మండలం జాన్కంపేట్‌న్ఖవీపేట్‌ ప్రధాన రహదారి డివైడర్‌ మధ్యన నుడా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజితా యాదవ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ పాటిల్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు జడ్పీ చైర్మన్‌
మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వంలో చేయనటువంటి బహత్తర కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లె సైతం అభివద్ధి పథంలో పయనించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా.. వాటి అమలుకు ప్రత్యేక నిధులను కేటాయించడం తెరాస ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. ప్రతి గ్రామం హరితశోభను సంతరించుకునేలా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఒక్క మొక్క సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నుడా చైర్మన్‌ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. నుడా పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ప్రణాళికాబద్దంగా మొక్కలు నాటుతామన్నారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం సంతరించుకుందని అన్నారు. నుడా ఆధ్వర్యంలో జానకంపెట్‌ నుంచి నవీపేట్‌ ప్రధాన రహదారి డివైడర్‌ మధ్యలో సుమారు 3,500 మొక్కలు నాటామన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పచ్చదనం పెరిగి మంచి వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నవీపేట్‌ సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌, స్థానిక ఎంపీటీసీ సంజీవ్‌, ఉప సర్పంచ్‌ వెల్మల విజయ్‌, నాయకులు ఎల్లయ్య యాదవ్‌, శేఖర్‌రాజ్‌, రాంబాబు, అజయ్‌ గౌడ్‌, నుడా డైరెక్టర్లతోపాటు పలువురు వార్డు సభ్యుల పాల్గొన్నారు.