అమరావతి వేగంతో తెలంగాణకు లాభం

ఓ వైపు నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు వెలగపూడిలో వేగం పుంజుకున్నాయి. జూన్‌ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనులు చకచకా సాగుతున్నాయి. మంత్రి నారాయణ పలు దజఫాలుగా పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులను జూన్‌ నెలాఖరుకు అక్కడికి తరలించి అక్కడి నుంచే నవ్యాంద్ర పాలన ఏపట్టాలని సిఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ దశలో తెలంగాణ సచివాలయ పునర్నిర్మాణం లేదా దాని తరలింపు ప్రక్రియ అటకెక్కింది. యాదృచ్ఛికమే అయినా  సివాలయకొత్త భవన నిర్మాణంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ గతకొంత కాలంగా ఎందుకనో కొంత వేగం తగ్గించారు. ఎలాగూ అమరావతికి ఆంధ్‌ఆర వారు వెల్లిపోతుండడంతో ఈ నిర్ణయం తసీఉకుని ఉంటారని కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఏదేమైనా ఇప్పుడన్న సచివాలయ ప్రాంతమే తెలంగాణకు అనువుగా ఉంటుందనడంలో సందేహం లేదు. దీనికి మార్పులు లేదా పునర్నిర్మాణం చేస్తే మంచిదే. ఇకపోతే అమరావతి తాత్కాలకి రాజధాని ప్రాంతంలో రెండో దశ నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టే మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం మొదలైన వాటిపై ఏపీ సీఆర్డీఏ అధికార యంత్రాంగం కీలకమైన కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలిక సచివాలయాన్ని ఉద్యోగుల తరలింపు నాటికి కార్యనిర్వహణకు అనుకూలంగా పూర్తి స్థాయిలో సిద్ధం చేసే ప్రణాళికల రూపకల్పన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని 6 భవనాలను ప్రత్యేకంగా రూపొందించనున్నారు. జూన్‌ 27వ తేదీనాటికి అమరావతిలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులు తరలివస్తారని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణ కంపెనీలు కూడా  పనులు శరవేగంగా పూర్తి చేసున్నారు. పనులు మొత్తం ప్రీఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతిలో ఈ నిర్మాణాలు సాగుతున్నందున ఈ భవనాలకు సీలింగ్‌ల తొలగింపు పనులు ఉండవు. తద్వారా వెనువెంటనే ఆయా భవనాలకు ఫినిషింగ్‌ పనులను చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలపై సీఆర్డీఏకు చెందిన ఇంజనీర్లు నిత్యం ఉన్నతాధికారులకు నిత్యం సమాచారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వీటిపై సీఆర్డీఏ అత్యున్నత యంత్రాగం ద్వారా రాష్ట్ర సీఎస్‌ వివరాలు సేకరించినట్లు సమాచారం. దీంతో ఈ నెల చివరి నాటికి మరోసారి తాత్కాలిక సచివాలయం నిర్మాణాలపై ఉన్నతా స్థాయిలో సవిూక్ష జరగనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల తరలింపులో భాగంగా తాత్కాలిక సచివాలయానికి విడతల వారీగా రానున్న ఉద్యోగుల సంఖ్య దాదాపు పది వేలకు పైగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. దీంతో నూతన రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తయ్యేలోపుగా సచివాయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య దాదాపుగా 15 వేలకు చేరనుంది. వీరికి అదనంగా పలు పనుల రీత్యా సచివాలయానికి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దీంతో తాత్కాలిక సచివాలయానికి చేరుకోవడానికి అవసరమయిన రహదారులతో సహా మిగిలిన మౌలిక సదుపాయాలను సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యకు రెట్టింపు అవసరాలను తీర్చేలా ఉండాలని ప్రణాళికల్లో పేర్కొన్నారు. మొత్తంగా ఎపి సచివాలయం తరలిపోతున్న దశలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ కొత్త సచివాలయ నిర్మాణంపై కొంత వెనకడుగు వేశారని సమాచారం. ఖజానాపై అదనపు భారం పడకుండా చూసుకోవాలన్న ఆలోచన కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఏపీ సచివాలయం మొత్తం ఆగస్టు చివరి నాటికి ఖాళీ అయ్యే అవకా శం ఉన్న నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనా లన్నీ తెలంగాణకు వచ్చేయనున్నాయి. దీంతో కార్యాల యాల కొరత కూడా ఉండదని భావిస్తు న్నారు.

ఇప్పుడున్న భవనాలకు మరమ్మతు లు చేయటం ద్వారా ఖర్చు తగ్గించొచ్చన్న ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. ఇటీవల అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండపై ఏర్పాటు చేయనున్న అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ముందు బుద్దుడు ఆ తర్వాత అంబేద్కర్‌ వెనుక భాగంలో సచివాలయం వుంటుందని సీఎం కెసిఆర్‌  చెప్పారు. వీటికి ఎదురుగానే జూన్‌ 2న ఏర్పాటు చేయనున్న అమర వీరు ల స్థూపానికి శంకుస్థాపన పై సీఎం కేసీఆర్‌ ఇటీవలనే సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా కూడా ఇదే విషయాలను చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనలతో సచివాలయం మార్పు లేదనే విషయాలు స్సష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న సచివాలయానికే మార్పులు చేయటంతో పాటు అదనపు అంతస్తులు ఏర్పాటు చేయటం లాంటివి చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి వ చ్చినట్లు తెలు స్తోంది. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి  కార్యాలయాన్ని 11 అంత స్తులకు పెంచటం.. మిగిలిన భవనాల్ని సైతం 10 అంతస్తులకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. వాస్తు ఇబ్బందులు ఉన్నా… . వాటిని సరి చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండాలని … కీలక అధికారుల క్వార్టర్స్‌తో పాటు.. తెలంగాణ సచివాలయం సరికొత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్‌ భావించారు.  అయితే సచివాలయ మార్పును ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ… సచివాలయ మార్పువిూద కేసీఆర్‌ పునరాలోచన చేస్తున్నారని అర్థం అవుతోంది.  మొత్తంగా అమరావతి తాత్కాలిక సచివాలయనిర్మాణం శరవేగంగా సాగడం, తెలంగాణలో మార్పుల ఆలోచనలకు బ్రేక పడడం యాదృచ్ఛికం కావచ్చు.