అరటి సాగులో మెళకువలు పాటించాలి

రైతులకు అవగాహన సదస్సులో అధికారుల సూచన

కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అరటి సాగు చేస్తున్న రైతన్నలు అధికారుల సూచనల మేరకు మెళుకువలు పాటించి అధికాదాయం పొందొచ్చని ఏలేశ్వరం మండల ఉద్యానవన శాఖ అధికారి కే.దివ్యశ్రీ అన్నారు. మండలంలోని తిరుమలి గ్రామంలో అరటి సాగులో పోషకాల వినియోగం పై సోమవారం అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన దివ్యశ్రీ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో పోషకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పెరుమళ్ళ రాజు చెరువు ఆయకట్టు కింద 189 ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారని తెలిపారు. వారి అరటి పంటకు అవసరమైన పోషకాలు కలిగిన కిట్లను ఉద్యానవన శాఖ ద్వారా అధికారిణి అందజేశారు. ఈ కిట్టు లలో 19:19:19, 13:0:45, లతోపాటు ఆగ్రో మిక్స్‌ తదితర పోషకాలు సమకూర్చారని తెలిపారు. వాటిని రైతులు అధికారుల సూచనల మేరకు.. వినియోగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూతి కృష్ణ ప్రసాద్‌, ఓలేటి చంటి బాబు, ఉద్యానవన శాఖ సిబ్బంది నాని బాబు, బి.నిఖిల్‌, రైతులు పాల్గొన్నారు.