అల్లోలపై ఇక అడవుల రక్షణ బాధ్యత 

కెసిఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సాగాలి
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): /ూష్ట్రంలో ఎక్కడాలేని అటవీ విస్తీర్ణం 33 శాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉంది. కొన్నేళ్ల నుంచి అడవుల జిల్లాలోని బంగారంతో పోల్చే టేకు తదితర విలువైన  కలప తరలిపోతోంది. ఇదివరకు దట్టంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు క్రమేణా మాయమవుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. స్మగ్లర్లు. అడవులను ఇష్టారీతిన నరికి వేస్తుండటంతో భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. రహదారికి ఇరువైపులా చెట్లు కనిపిస్తున్నా.. కొద్దిగా లోపలకు వెళ్తే అంతా మైదానప్రాంతమే. అటవీ విస్తీర్ణం బాగుందని, సవిూపంలోనే తాడోబా అభయారణ్యం ఉందన్న కారణంతో నిర్మల్‌ సవిూపంలోని కవ్వాల్‌ను పులుల సంరక్షణ కేంద్రంగా కేంద్రం ప్రకటించారు. పులుల సంచారం పెరుగుతున్నా.. స్మగ్లర్ల కారణంగా అటవీ విస్తీర్ణం తగ్గుతుండటం, వన్యప్రాణుల వేట పెరుగుతుండటంతో పులుల ఆవాసానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాజాగా పులులను చంపిన ఘటనలు వెలుగులోకి రావటం అడవుల దుస్థితికి ఎలా ఉందో చెప్పొచ్చు. ఇటీవల కలప అక్రమ రవాణా తరలిస్తూ పట్టుబడ్డ వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశించడంతో పాటు ఏకకాలంలో ఆ శాఖలో దాదాపు 200 మందికిపైగా అధికారులను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడవుల సంరక్షణ బాధ్యతను ఈ సారి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పజెప్పారు. మంత్రిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించే అల్లోలకు అటవీశాఖ కట్టబెట్టడంతో పూర్వపు అడవుల జిల్లాగా మారుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదివరకు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన వారెవరూ మరుసటి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసి పనులు చేయించారు. పురాతన ఆలయాలకు పునరుద్ధరణ పనులు చేయించారు. అన్ని ఆలయాల్లోనూ దూప, దీప నైవేద్యాలు అమలయ్యేలా కృషి చేశారు. ఆలయాల్లోని పూజారులకు ప్రతి నెలా రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం ఇప్పించారు. గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలతో పాటు సమ్మక్క-సారలమ్మ జాతరను సమర్థంగా నిర్వహించారు. తనకు కేటాయించిన మూడు శాఖలను బాధ్యతతో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా అడవుల రక్షణకు కెసిఆర్‌ ఆదేవాల మేరకు కఠినంగా చర్యలు తీసుకుంటానని హావిూ ఇచ్చారు. కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే ఆయన సంకల్పమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాకారం కోసం పనిచేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.