అవినీతి నిర్మూలనకై సంస్కరణలు 

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నివారించాలి
సులభతర వాణిజ్య విధానంలో సంస్కరణలు ఆవశ్యకం: సిఎస్‌
అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించేం దుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సులభతర వాణిజ్యంనుకు సంబంధించి తీసుకురానున్న సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2019పై పరిశ్రమలు సంబంధిత శాఖల అధికారులతో సవిూక్షించారు. ఈసందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నివారించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అవినీతి నిర్మూలనకై అవసరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలతో నేరుగా ఎక్కువ సంబంధాలు ఉండే శాఖల్లో ముందుగా ఈవిధమైన సంస్కరణలు తీసుకవచ్చి తదుపరి అన్ని శాఖల్లో ఈసంస్కరణలు తీసుకువచ్చి పూర్తి రాష్ట్రంలో అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మూలించే చర్యల తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఇక సులభతర వాణిజ్య విధానంలో తీసుకురానున్న సంస్కరణలపై సిఎస్‌ మాట్లాడుతూ త్వరితగతిన ప్రతిపాదిత సంస్కరణలను అమలులోకి తీసుకువచ్చి మెరుగైన రీతిలో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. వాణిజ్య వివాధాల కేసుల పరిష్కారానికి ప్రస్తుతం విశాఖలో పనిచేస్తున్న కమర్షియల్‌ కోర్టుకు పూర్తి స్థాయిలో కేసులు లేకుంటే వారంలో మూడు రోజులు విశాఖలోను, మరో మూడు రోజులు విజయవాడలోను ఈకోర్టు పనిచేసేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఆవిధంగా చేయడం వల్ల రాష్ట్రంలో ఇలాంటి వివాధాల పరిష్కారానికి రెండు ప్రత్యేక కోర్టులు పనిచేస్తున్నట్టు అవుతుందని పేర్కొన్నారు.ఇలాంటి ప్రత్యేక కోర్టులు ద్వారా పరిష్కరించిన కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ఎ/-లాన్‌ 2019కు సంబంధించి తీసుకురానున్న సంస్కరణలన్నిటినీ త్వరితగతిన అమలులోకి తీసుకు వచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సిఎస్‌ సుబ్రహ్మణ్యం పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ మాట్లాడుతూ బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2019కు సంబంధించిన సంస్కరణలను సకాలంలో అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు పరిశ్రమలశాఖ కవిూషనర్‌ సిద్దార్ధ జైన్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ఎ/-లాన్‌ 2019పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తూ మొత్తం 18శాఖలకు సంబంధించి 80 సంస్కరణలు తీసుకురానున్నట్టు వివరించారు.వాటిలో 55 సంస్కరణలు యూజర్‌ స్పెసిఫిక్‌ సంస్కరణలు కాగా మిగతా 25 జనరల్‌ సంస్కరణలని పేర్కొన్నారు.ఇప్పటికే 73 సంస్కరణలను కంపైల్‌ చేయడం జరిగిందని ఈనెలాఖరులోగా సంస్కరణలన్నిటినీ పూర్తిగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. సమావేశంలో ఎపిఐఐసి ఎండి బాబు ఎ,మున్సిపల్‌ పరిపాలన శాఖ కవిూషనర్‌ శ్యామల రావు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్టేష్రన్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి,ఇంకా న్యాయశాఖ,
బాయిలర్స్‌,ఫ్యాక్టరీస్‌ తదితర శాఖల విభాగాల అధికారులు పాల్గొన్నారు.