అస్వస్థతకు గురైన కేజ్రీవాల్

అధికారిక కార్యక్రమాలు రద్దు

న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఐఏఎస్‌ల సమ్మెకు నిరసనగా లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నివాసమైన రాజ్‌నివాస్‌లో తొమ్మిది రోజుల పాటు ధర్నా చేపట్టిన కేజీవ్రాల్‌ గత రాత్రి ధర్నా విరమించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మంత్రులు నిర్వహించే సమావేశాలకు ఐఏఎస్‌లు హాజరుకావడంతో కేజీవ్రాల్‌ ధర్నా విరమించుకున్నారు. ఆయన అస్వస్థతకు గురైన కారణంగా ఈరోజు జరగాల్సిన సమావేశాలన్నీ రద్దు చేశారు. ప్రణాళిక ప్రకారం కేజీవ్రాల్‌ బుధవారం ఐఏఎస్‌ అధికారులతో సమావేశం కావాల్సి ఉంది.తొమ్మిది రోజులు పాటు రాజ్‌ నివాస్‌ వెయిటింగ్‌ గదిలో కూర్చొని ధర్నా చేయడం వల్ల కేజీవ్రాల్‌ ఉదయం, సాయంత్రం నడక మానేశారని, వేళకు భోజనం చేయలేదని, దీని వల్ల ఆయన చక్కెర స్థాయిలు పెరిగాయని ఆయన సన్నహితులు వెల్లడించారు. 49ఏళ్ల కేజీవ్రాల్‌ డయాబెటిక్‌ పేషెంట్‌. ఆయన కచ్చితంగా రోజుకు రెండు సార్లు నడుస్తారని, పద్ధతి ప్రకారం ఆహార నియమాలు పాటిస్తారని, ధర్నా వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందని చెప్పారు. కేజీవ్రాల్‌తో పాటు ధర్నాలో మంత్రులు సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌లు పాల్గొన్న సంగతి తెలిసిందే.