ఆంధ్రాలో ఎస్మా కిందికి వైద్య సేవ‌లు

` కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీక నిర్ణయం
అమరావతి,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవ చట్టం (ఎస్మా)ని తీసుకొస్తూ ఉత్తర్వు జారీ చేసింది. 6 నెల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసు, డాక్టర్లు, నర్సు, ఆరోగ్య సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా పనిచేసేందుకు నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య పరికరా కొనుగోు, నిర్వహణ, రవాణా సిబ్బంది, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రతా సిబ్బంది, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వ్యర్థా తరలింపు, మందు కొనుగోు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసును ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.