ఆంధ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం

12 మంది | దుర్మరణం

బ్రేకులు ఫీలై మూడు వాహనాలపై బోల్తా పడ్డ కంటైనర్

మృతుల్లో 8మంది ఒకే కుటుంబానికి చెందిన వారు

బంగారుపాళ్యం ,నవంబర్ 8(జనంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం బెంగళూ రుచిత్తూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్ వద్ద వాహనాలపై నీళ్ల సీసాల తో వెళ్తున్న కంటైనర్ బోల్తా ప డింది. బ్రేకులు విఫలం కావ డంతో డివైడర్ దాటి ఆటో, ఓమ్ని వ్యాన్, ద్విచక్ర వాహనం పైకి కంటైనర్ దూసుకెళ్లింది.  కుటుంబానికి చెందిన వారు ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు . చీకటి పడటంతో తొలుత పోలీసులకు మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది .గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి కోహెడ శేఖర్ కుటుంబానికి చెందిన 8 మంది ఓమ్ని వాహనంలో తెట్టుగుండ్లపల్లికి వెళ్లారు. తమ బంధువుల కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వారంతా వెళి తిరిగి వస్తుండగా ఈ ంబాన్ని పరామర్శించేందుకు కొనుగోలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరామర్శకు వెళ్లినవారు పిల్లలను మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు జాగిరి అలముకున్నాయి. ప్రమాదంలో కంటైనర్ దూసుకెళ్లడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపలెకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలో మృతిచెందారు.