ఆక్వాతో గొంతేరు జలాలను కలుషితం 

ఏలూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):  తుందుర్రులో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా
వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని వారు తెలిపారు. ఇప్పటికే సరైన ఉపాధి లేక మత్స్యకారులు వలసలు వెళ్తున్నారని వారు చెప్పారు. ఫుడ్‌పార్కు నిర్మాణం జరిగితే కాలువ నీరు
కలుషితమై అటు సాగునీరు, ఇటు తాగునీరు లభించని దుస్థితి ఏర్పడుతుందన్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించే జీవనాధారమైన గొంతేరు కాలువను కాపాడేందుకు ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు.గొంతేరు కాలువపై ఆధారపడి వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.