ఆగని స్మశాన వాటిక కబ్జా ఇసుక దందా

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో స్మశాన వాటిక స్థలం కబ్జా చేశారు గ్రామ ప్రజల అందరికీ సంబంధించిన స్మశాన వాటిక స్థలం 148 సర్వే నెంబరు 30 గుంటలు కబ్జా గురి కావడం జరిగింది గ్రామంలో స్మశాన వాటికను పంట పొలాలుగా చేసుకొని వరి పంట వేసుకుంటున్నారు గ్రామంలో ప్రజలు ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టడానికి కూడా స్మశాన వాటిక లో స్థలం లేకుండా పోతుందని ఇది ఇలాగే కొనసాగితే మా ఊర్లో స్మశాన వాటిక ఉండదు అనీ గ్రామస్తులు వాపోయారు అదే గ్రామానికి చెందిన మరో కొందరు స్మశాన వాటికలో ఇసుక డంపింగ్ చేశారు  దాదాపు 400 ట్రాక్టర్లు ఇసుక దాకా అక్రమంగా డంపింగ్ చేయడం జరిగినది అక్రమ ఇసుక దందా జరుగుతుంది గ్రామం లో రాజకీయ నాయకులకి  ఎవరికీ ఫిర్యాదు చేసిన వారు మళ్లీ ఇసుక దందా ఎవరైతే చేస్తున్నారో మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దానితో మేము ఎవరికి ఏం చెప్పాలో తెలియడం లేదు దీనిపై ప్రత్యేక చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని గ్రామస్తులు కోరుతున్నారు ఇసుకాసురులు చాలా చోట్ల ప్రభుత్వ పనుల పేరుతో ఈదందాను కొనసాగిస్తున్నారు పంచాయతీరాజ్‌ రోడ్ల  ఇళ్ల నిర్మాణాల పేరుతో  ఇసుకకు అనుమతి తీసుకుని నదులు, వాగులను అడ్డంగా తోడేస్తున్నారు నిజానికి సామాన్యులు ఒక ట్రాక్టర్‌ ఇసుక తీసుకోవాలంటే నానా ప్రయాసలు పడాల్సి వస్తోంది.స్మశాన వాటిక స్థలం కబ్జా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మాజీ సర్పంచ్ బాలరాజు మాజీ ఉప సర్పంచ్ నాగన్న గౌడ్
కొమ్మ రాజు యాదవ్ చంద్రయ్య యాదవ్  ఉడుత నాగరాజు యాదవ్ గడ్డం కురుమయ్య యాదవ్ రామయ్య యాదవ్ రాముడు యాదవ్, ఉడుత గోపాల్ యాదవ్, కలమూరి మధు రాజు కావాలి రాఘవ తదితరులున్నారు