ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాజసింహా

– దర్శకుడిగా, రచయితగా గుర్తింపు
– అవకాశాలు సన్నగిల్లడంతోనే ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ, మే17(జ‌నం సాక్షి) : దర్శకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న రాజసింహా ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నంకి పాల్పడడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2016లో సందీప్‌ కిషన్‌, నిత్యా విూనన్‌ ప్రధానపాత్రలలో ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రాన్ని తెరకెక్కించాడు రాజసింహా. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీయస్‌, బొమ్మరిల్లు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రచయితగా పనిచేశారు. నటుడిగా సంబరం , స్నేహం, టక్కరి దొంగ వంటి చిత్రాలలో కనిపించారు. అయితే కొంత కాలంగా అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌లో ఉన్న రాజసింహా తన రూంలో నిద్ర మాత్రలు అధిక మోతాదులో మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడట. ప్రస్తుతం ముంబైలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రాజసింహా. ‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్‌ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు సంభాషణలు రాసి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
—————————-