ఆదిలాబాద్‌లో కార్డెన్‌ సర్చ్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ ¬సింగ్‌ బోర్డు కాలనిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు, 1 ట్రాక్టర్‌, 5 వేల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక బెల్ట్‌ షాప్‌ గుర్తింపు మూసివేసి మహిళపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌, వారియర్‌, అదనపు ఎస్పీ ఎస్‌.మోహనరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.