ఆదిలాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ నేతృత్వంలో జరిగిన సోదాల్లో పోలీసు సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 కార్లు, భారీగా బైక్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల అక్రమ కలపను పట్టుకున్నారు.