ఆదివాసీ హక్కులను కాపాడాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1: ఆదివాసీ హక్కులు, చట్టాలతో పాటు సమస్యలపై పోరాడుతామని ఆదివాసీ తెగ సంఘాల ఐక్యకార్యచరణ సమితి ప్రకటించింది. గిరిజనలు హక్కలుకు భంగం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్నట్లుగా గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించాలని గిరిజనవిద్యార్ధి సమాఖ్య డిమాండ్‌చేసింది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తేవడంతో పాటు అన్నిరంగాల్లో అవకాశం కల్పించాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు చట్టం తేవడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అవి నడిచేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే పార్లమెంట్‌ సభ్యుల ఇళ్లను ముట్టడిస్తామని సమాఖ్య నేతలు హెచ్చరించారు.