ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు
భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం చేశారని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు, టీపీసీసీ సభ్యులు ఎస్‌కె జానీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీవీ భద్రం, మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కటకం పద్మావతి విమర్శించారు. పార్టీ మారడం అన్నది ఆదివసాఉలకు ద్రోమం చేయడమేనని అన్నారు.
స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దమ్ముంటే రాజనీమా చేసి మళ్లీ గెలవాలని అన్నారు. అదివాసులకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని కాంతారావు ఆరోపించడం సరికాదన్నారు. దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్‌ చేసిన అభివృద్‌ధ్ది పథకాలను మరిచి, తప్పుడు పద్ధతులకు పాల్పడటం నీతిమాలిన చర్యఅని విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే మువందు ఎందుకు ఈ పార్టీ నుంచి ఎన్నికయ్యారో చెప్పాలన్నారు.  ఆయన్ను గ్రామాల్లో తిరగనీయకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. పార్టీ మారినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.