ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో అక్రమాలకు చెక్‌ 

కరీంనగర్‌,జ‌నం సాక్షి): ఇంటర్‌ ఫలితాలు వెలువడటంతో డిగ్రీ ప్రవేశాలపై దృష్టి నెలకొంది. కొన్నేళ్లుగా శాతవాహన విశ్వవిద్యాయలం పరిధిలో కళాశాలలు పూర్తి స్థాయి తనిఖీలకు నోచుకోలేదు. మౌలిక వసతుల కల్పనలోనే నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. నిబధనల మేరకు తరగతి, ప్రయోగశాలల ఏర్పాటు అత్యధిక కళాశాల్లో లేదు. అర్హులైన అధ్యాపకులు ఉన్నారా అనే విషయం చూస్తే దస్త్రాల్లో ఒకరు, తరగతి గదిలో మరొకరు.. ప్రయోగశాల ఉన్నా అందులో పరికరాలు శూన్యం.. గ్రంథాలయాల విషయంలో ఎవరికీ పట్టింపు లేదు. కనీసం పాఠ్యపుస్తకాలు లభ్యం కావు. అగ్నిమాపక చర్యలు తీసుకున్న పాపన పోలేదని విజిలెన్స్‌ అధికారులు వాపోవడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు ¬దా దక్కించుకుంటేనే వీటిలో ప్రవేశాలకుఅ నుమతి ఉంటుంది. ఆన్‌లైన్‌ ప్రవేశాల కారణంగా అక్రమాలకు తావులేకుండా చూస్తున్నారు. గత విద్యా సంవత్సరం శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్నత విద్యామండలి తనిఖీలు చేపడుతుందని ప్రకటించారు. విూన మేషాలు లెక్కించే సమయానికి తొలిసారిగా ఆన్‌లైన్‌ ప్రవేశాల పక్రియ ప్రారంభం అయింది. చేసేది లేక ఉన్నత విద్యామండలి తనిఖీలకు రాకుండా వర్సిటీలకు ఆ బాధ్యతను అప్పగించింది. సమయం లేకపోవడంతో మొక్కు బడిగా తనిఖీలు చేపట్టి ప్రవేశాలకు అనుమతిచ్చారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు వృత్తి విద్యా కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టింది. ఏ కళాశాలల్లో వసతులు ఉన్నాయని ప్రవేశాలకు అనుమతి ఇచ్చారో సంబంధిత కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలింది. మౌళిక వసతులు, అధ్యాపక బృందం, ప్రయోగశాలలు తదితర అంశాల్లో లోపాలున్నట్లు గుర్తించారు. సంబంధిత నివేదికలను విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. విజిలెన్స్‌ నివేదికలను ఇప్పుడు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.  విద్యార్థుల సంఖ్యకు మించి కళాశాలలు, సీట్లు ఉండటం వలన ఎక్కడ నాణ్యమైన విద్య లభించడం లేదు. వర్సిటీకి పూర్తి ఉపకులపతి లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతోందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
—————