ఆరు రాష్టాల్రకు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  దేశంలోని ఆరు రాష్టాల్ల్రో  రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌, యుపి, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, భీహర్‌, కేరళ రాష్టాల్లో కుంభవృష్టి కురుస్తోందని హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్టాల్ర ప్రజలను ఆప్రమత్తంగా ఉండాలిని సూచించింది. ఇటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్టాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో యమునా నదితీరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యమునా నది డేంజర్‌ మార్క్‌ 205.33 విూటర్లు కాగా, ప్రస్తుతం 205.96 వద్ద వరద ప్రవహిస్తోంది. హర్యానాలోని హత్నికుంద్‌ బ్యారేజ్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో యమునాకు వరద పోటెత్తింది. ఇవాళ ఉదయం 25,316 క్యూసెక్కుల నీటిని అధికంగా విడుదల చేశారు. వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో ఓల్డ్‌ లోహ పుల్‌ రహదారిని మూసివేశారు. పాదాచారులను ఇక్కడికి రానివ్వడం లేదు. వాహనాలను దారి మళ్లించారు.