ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి

బాన్సువాడ, జనంసాక్షి(ఆగస్టు 17):
ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో, ప్రభుత్వ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని  కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రక్త దానం చేయడం ఎంతో అభినందనీయమని, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమౌతామనీ ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేసిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీరజ వెంకటరామిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, డి.ఎస్.పి జైపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాస ప్రసాద్, ఆర్డీవో రాజాగౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు శివదాస్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రఘు, ఆనంద్ ,కళ్యాణి, సూర్యకాంత్ ,శ్రీనివాస్, తెరాస మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, మన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు.