ఆర్టీసీ విభజనకు సబ్‌కమిటీల ఏర్పాటు

హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి): ఇక ఎట్టకేలకు ఆర్టీసీ విభజనకు ఆర్టీసీ యాజమాన్యం పని మొదలు పెట్టింది. ఆర్టీసీ విభజనపై యాజమాన్యంతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. రెండు రాష్టాల్రకు 2 సబ్‌కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఉద్యోగుల విభజన 4 రోజుల్లో పూర్తి చేయాలని సబ్‌కమిటీలకు సూచించారు. ఆస్తులు, అప్పుల విషయం పక్కనపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. వివాదాస్పద ఉద్యోగుల అంశం తాత్కాలికంగా పక్కనపెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 7న సబ్‌ కమిటీలతో ఆర్టీసీ యాజమాన్యం సమావేశం కానుంది. ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ విభజనపై యాజమాన్యం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆర్టీసీ విభజనపై తెలంగాణ, ఏపీ రాష్టాల్రకు రెండు సబ్‌కమిటీలను యాజమన్యాం ఏర్పాటు చేసింది. ఆర్టీసీని విభజించాలని గత కొన్ని రోజుల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే.  తెలంగాణ సబ్‌కమిటీకి రమణారావు, ఏపీ సబ్‌కమిటీకి ఏవీరావు నేతృత్వం వహించనున్నారు. ఉద్యోగుల విభజనను 4 రోజుల్లో పూర్తి చేయాలని సబ్‌కమిటీలకు యాజమాన్యం సూచించింది. ప్రస్తుతానికి ఆస్తులు, అప్పుల విషయం పక్కన పెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. వివాదాస్పద ఉద్యోగుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని నిర్ణయించారు. మరోసారి ఈ నెల 7న సబ్‌కమిటీలతో ఆర్టీసీ యాజమాన్యం సమావేశం కానుంది.