ఆర్థిక చిక్కుముడిని నిర్మలమ్మ  విప్పేనా?

కేంద్ర బ్జడెట్లో ఎవరికి వరాలు..ఎవరికి వడ్డింపులు.. అన్న చర్చ ఇప్పటికే మొదలయ్యింది. తొలిసారి ఆర్థికంత్రి ¬దాలో నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ జూలై 5న అంటే నేడు పార్లమెంట్‌ ముందుకు రానుంది. గతంలో వాణిజ్యశాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి దక్షత చూపిన ఆమె తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పసందైన విందు వడ్డిస్తారన్న ఆశలో సామాన్యులు ఉన్నారు. అందరికి విందు భోజనం కాకపోయినా కడుఉ నింపుకునే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. అలాగే ఎవరికి వారు ఊరడింపు దక్కుతుందన్న భావనలో ఉన్నారు. దీంతో వివిధ వర్గాల్లో బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా వేతన జీవులు, చిన్నమధ్య తరహా పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా నేటి బడ్జెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వేతన జీవుల సంగతి వేరుగా చెప్పక్కర్లేదు. తమకు ఆదాయపు పన్ను మినహాయింపు, రాయితీల కోసం వారు ఎల్లవేళలా ఎదురు చూస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ వాయింపులతో ఇప్పటికే కుదేలయిన ఆర్థిక రంగాన్ని నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటార్నది దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. వీరే కాకుండా పారిశ్రామిక రంగం కూడా అదే ఆసక్తిని వ్యక్తం చేస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌ కావడంతో, ఎన్నికల హావిూలను ఎలా తీర్చబోతున్నారన్నది బడ్జెట్‌ను బట్టి తేటతెల్లం కానుంది. మోడీ దార్శనికతకు ఈ బడ్జెట్‌ అద్దం పట్టనుంది. నేడు పార్లమెంటులో సమర్పించబోయే బ్జడెట్‌లో వ్యవసాయం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాలని ఓ నివేదిక సూచించింది. వ్యవసాయానికి సంబంధించి జీఎస్‌టీ మండలి మాదిరిగా వ్యవసాయ మార్కెటింగ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. తరిగిపోతున్న నీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కూడా చూపాలని పేర్కొంది. జీఎస్‌టీ అమలు, స్టాంప్‌ డ్యూటీ రుసుములు హేతుబద్దీకరణ అనంతరం స్థిరాస్తిరంగం నెమ్మ దించింది. ఈ రంగానికి ఊతమివ్వాలంటే బ్జడెట్లో కొన్ని ప్రతిపాదనలు చేయడమే కాకుండా ఎన్‌బీఎఫ్‌సీల నిధుల కొరత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఎంతో కీలకమైన ఎంఎస్‌ఎమ్‌ఈలకు కూడా బ్జడెట్లో ప్రోత్సాహకాలను ప్రకటించాలని తెలిపింది. ముఖ్యంగా రుణాలకు సంబంధించిన నిబంధనల్లో కొంత సడలింపులు చేయాలని వివరించింది. స్థిరాస్తి రంగానికి పరిశ్రమ ¬దా ఇవ్వాలని సంబంధిత వర్గాలు చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నాయి. అందుబాటు ధరలో గృహాలు నిర్మించే వర్గాలకు ఈ ¬దాను 2017లో ఇచ్చారు. తక్కువ వడ్డీతో నిధుల సవిూకరణ, మూలధన వ్యయం తగ్గింపు నిమిత్తం పరిశ్రమ ¬దాను యావత్‌ స్థిరాస్తి రంగానికి విస్తరింప జేయాలని ఈ వర్గాలు కోరుతున్నాయి.  అనేక శాఖల నుంచి రకరకాల అనుమతులు తీసుకొనేందుకు స్థిరాస్తి వ్యాపారులకు 12 నుంచి 36 నెలల సమయం పడుతోంది. ఆ తర్వాతే పనుల్ని ప్రారంభించుకోగలుగు తున్నారు. దీని స్థానంలో ఏకగవాక్ష విధానాన్ని పరిశ్రమ ఆశిస్తోంది. ఈసారి స్థిరాస్తి రంగానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెలువడవచ్చనే విషయంలో పారిశ్రామిక వర్గాలతో పాటు కొనుగోలుదారుల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది.స్థిరాస్తి నియంత్రణ చట్టం(రెరా)అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక ప్రాజెక్టులు అసం పూర్తిగా మిగిలిపోయి, ఐదులక్షల మంది కొనుగోలుదారుల కష్టార్జితాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన నేపథ్యంలో ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసి పరిశ్రమను గ్టటెక్కించాలని కోరుతున్నారు. నిజానికి సామాన్యుడికి ఇల్లు అన్నది నగరాల్లో ఓ కలగా మారింది. నోట్లరద్దు తరవాత ఇల్లు కొనడం అన్నది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సాధ్యం కాని వ్వయహారంగా మారింది. పెరుగుతున్న సిమెంట్‌, ఇసుక, ఇటుక, స్టీల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే భూముల ధరలు కూడా అందనంత ఎత్తుకు పోయాయి. కేంద్ర ప్రభుత్వం బ్జడెట్‌లో ఎగుమతి వ్యాపార సంస్థలను ప్రోత్సహించే ప్రతిపాదనలు చేయాలి. ప్రస్తుతం దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. తద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు, పొదుపు- వినియోగం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. దేశానికి తూర్పు, పశ్చిమ తీరాల్లో రెండు అతిపెద్ద కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్లను చేపట్టాలని  నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. వాటిని  చేపట్టటానికి ఇదే సరైన తరుణం. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధులు సమకూర్చటం ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కార్పొరేట్‌ వివాదాలు సత్వరం పరిష్కారం కానందున పెద్దమొత్తంలో చెలింపులు నిలిచిపోతున్నాయి. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతోంది. కార్పొరేట్‌ పన్నును క్రమంగా 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌  ఉంది. వార్షిక టర్నోవరుతో సంబంధం లేకుండా కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి పరిమితం చేయాలని కార్పొరేట్‌ వర్గాలు కోరుకుంటున్నాయి.  అంతకంటే ముందు కంపెనీలన్నింటికీ 25 శాతానికి పరిమితం చేయాలని అసోచామ్‌ కోరింది.గతేడాది అమెరికా ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించింది. అందుకే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ బలంగా పోటీపడలేక పోతోందని అభిప్రాయపడింది. కార్పొరేట్‌ పన్నును తగ్గించడంపై సీఐఐ, అసోచామ్‌లు కూడా ఇదే తరహా అభిప్రాయా లను వ్యక్తం చేశాయి. మొత్తంగా నిర్మలా సీతారామన్‌  బడ్జెట్‌ను ఎలా వండి వారుస్తారో అని ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పర్చగలిగితే అంతకు మించిన ఆనందం ఉండదు. మనది పేద, మధ్య తరగతి కుటుంబం కనుక ఈ రంగాల అభివృద్దికి దోహదపడే విధంగా నిర్ణయాలు ఉంటేనే దేశ ఆర్థకి ప్రగతి సాధ్యం అవుతుంది.అందుకు నిర్మలాసీతారామన్‌ చూపే పరిస్కారాలు ఎలా ఉంటోయో దాని ఆధారంగా అంచనా వేయవచ్చు.