ఆర్మీ స్టోర్‌ రూమ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  టోలీచౌక్‌ లోని ఓల్డ్‌ ఎండి లైన్స్‌ ఆర్మీ  స్టోర్‌ రూమ్‌లో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మిలటరీ ఇంజనీర్స్‌ సర్వీసెస్‌ విభాగంలోని సామాన్లు భద్రపరచే షెడ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయ్‌..ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్నికీలలతో సైన్యానికి సంబంధించిన వస్తువులు మంటల్లో కాలిబూడిదయ్యాయి.. ఐదు ఫైరిరజన్లతో పాటు.. ఆర్మీకి చెందిన వాటర్‌ ట్యాంకులను రంగంలోకి దింపినా మూడు గంటల పాటు అగ్నిమాపకశాఖ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఆర్మీ సిబ్బంది అతికష్టంవ్మిూద మంటల్ని అదుపులోకి తేగలిగారు. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో సంఘటనా స్థలానికి ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సవిూక్షించారు.