ఆర్‌బిఐకి పూర్తి స్వేఛ్చ ఉండాలి

స్వతంత్రను గౌరవిస్తేనే భద్రత

టీవీ ఇంటర్వ్యూలో రఘురామరాజన్‌

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆర్‌బీఐకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్న వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ మద్దతు పలికారు. దేశం లబ్ధి పొందాలంటే ఆర్‌బీఐకు స్వతంత్రత

ఉండాలని తెలిపారు. ఆయన ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆర్‌బీఐ, ప్రభుత్వం పరస్పర అభిప్రాయాలను, స్వతంత్రతను గౌరవించుకొంటే ఈ వివాదం తేలిగ్గా పరిష్కారం అవుతుందని తెలిపారు. ‘దేశ క్షేమం కోసం వీలైనంత వరకు ఆర్‌బీఐ స్వతంత్రతను గౌరవించడం మంచింది. దీంతోపాటు సంప్రదాయాలను కూడా పాటించాలి. ఒక వేళ వ్యవస్థలో నిధుల ప్రవాహానికి సంబంధించిన సమస్య ఉంటే ఆర్‌బీఐ దానిని చూసుకొంటుంది. లేకపోతే అవసరమైన ప్రైవేటు సంస్థలకు లిక్విడిటీ సమకూరుస్తుంది. అది మంచిపద్ధతి’ అని తెలిపారు. /ూన్‌బ్యాంకింగ్‌ ్గ/నాన్స్‌ కంపెనీలకు నగదు లభ్యత విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐకు గతనెల మధ్య వివాదం మొదలైంది. ప్రభుత్వం వ్యవస్థలోకి మరిన్ని నిధులను రప్పించాలని కోరుతుండగా ఆర్‌బీఐ మాత్రం తనదైన శైలిలో పనిచేసుకుపోయింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య ప్రసంగంతో ఈ విషయం బయటపడింది. ప్రభుత్వ జోక్యాన్ని ఆచార్య బయటపెట్టడాన్ని రాజన్‌ అభినందించారు. కాకపోతే ఆర్‌బీఐ కూడా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను సమకూర్చాల్సి ఉందని పరోక్షంగా ప్రభుత్వాన్ని కూడా సమర్థించారు.