ఆర్‌బిఐ నిర్ణయాలపై సవిూక్ష జరగాలి

రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు కఠినంగా ఉంటే బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లోనే బ్యాంకులు దివాళా తీయడం,నష్టాలల్లోకి  జారుకోవడం, ఎగవేత దారులుపెరగడం, దేశం విడిచి పారిపోవడం అన్నీ కూడా కఠిన నిబంధనలు అమలు చేయకపోవడం కారణంగానే చెప్పుకోవాలి. ఆర్‌బిఐ కొరడా ఝళిపిస్తే తప్ప బ్యాంకులు బాగుపడేలా లేవు. ఉదారంగా వేలకోట్లు రుణాలు ఇస్తూ నిరర్థక ఆస్తులు పెంచుకుంటున్న బ్యాంకులు సామాన్యులను మాత్రం ముక్కు పిండుతున్నాయి. వారికి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఎటిఎంకు వెళితే కూడా ఫ్రీగా డబ్బులు డ్రా చేసుకునే వీలుండది. ఇలాంటి వ్యవహారాలను సవిూక్షించాల్సిన పని ఆర్‌బిఐ గవర్నర్‌దే. కానీ కిందిస్థాయిలో ఏం జరుగుతుందో వినియోగదారులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో గుర్తించడం లేదు. మాల్యా లాంటి వారు వేలకోట్లు ఎగవేస్తున్నారు. ఇకపోతే భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద నష్టాన్ని ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నమోదు చేసింది. 2016 మార్చితో ముగిసే నాలుగో తైమ్రాసికం నాటికి రూ.5,367.14 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఈ బ్యాంక్‌ ఇదే సమయంలో దాదాపు రూ.306 కోట్ల లాభాన్ని చవిచూసింది. బ్యాంకు నిర్వహణ వ్యయాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. గత ఏడాది దాదాపు 3834.19 కోట్ల నుంచి రూ.10,485.23 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ రూ.55,818.33 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో అలాంటి ఆస్తుల విలువ రూ. 25,694.86 మాత్రమే. దీంతో అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ మూడో తైమ్రాసిక ఫలితాలు భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలను నమోదు చేశాయి. ఇదంతా ఎందుకు జరిగిందంటే బ్యాంకు నిబంధనలు కఠినంగా అమలు చేయకుండా బ్యాంకింగ్‌ సిబ్బంది అక్రమాలకు పాల్పడడం వల్లనే అని తెలుసుకోవాలి. అందుకే ఆర్‌బిఐ గవర్నర్‌ పనితీరు పటిష్టంగా ఉండాలి. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామరాజన్‌ పనితీరుపై విమర్శలు వస్తున్న తరుణంలో ఎంపి సుబ్రమణ్యస్వామి ఇప్పుడాయనను సాగనంపాలని కోరుతున్నారు. ప్రధానికి ఈ మేరకు లేఖ కూడా రాశారు. నిజంగా ఆయన పనితీరు సరిగా ఉంటే పంజాబ్‌ బ్యాంక్‌ ఇంతగా దిగజారుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న వేసుకోవాలి. వచ్చే సెప్టెంబరుతో రాజన్‌ పదవీకాలం ముగియనున్నందున, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు రెండో పర్యాయం కొనసాగించరాదని బిజెపి భావిస్తోంది. అంతకు ముందే సుబ్రమణ్యస్వామి గట్టిగా పట్టుబడుతున్నారు. రాజన్‌ మానసికంగా పూర్తి స్థాయి భారతీయుడు కాదని, ఆయన ను తక్షణమే ఆర్‌బిఐ గవర్నర్‌ పదవి నుండి తప్పించాలంటూ స్వామి చెలరేగిపోయాడు. అందుకు ఆయన చెబుతున్న కారణం అమెరికా ప్రభుత్వం ఇచ్చిన గ్రీన్‌ కార్డును రాజన్‌ ఎప్పటికప్పుడు పునరుద్ధరించు కుంటున్నారన్నది చిన్న కారణమే అయినా ఆలోచించ దగ్గదే.

వేలకోట్లు ముంచుతున్న వారిని బ్యాంకులు ఉపేక్షిస్తూ వారి పేర్లను మాత్రం ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నాయి. సామాన్యులను మాత్రం వేటకుక్కల్లా వెంటాడుతున్నాయి. నిజానికి సామాన్యులకు అండగా ఉంటే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే వారు ఎంతగానో అభివృద్ది చెందుతారు. రుణగ్రహీతలను ఎక్కువ మంది అంటే సామాన్యులకు చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకంగా బ్యాంకుల విధానాలు, రుణ విధానాలు ఉండాలి. తక్కువ వడ్డీలకు రుణాలు దక్కాలి. కానీ భారతీయ బ్యాంకులు ఆ కోవలో ఆలోచించడం లేదు. వారి దృష్టి కార్పోరేట్ల విూద ఉంది. ఇదంతా ఆర్‌బిఐ సవిూక్షించాలి. సామాన్యులకు చేరువలో ఉంటే వారే నిక్కచ్చిగా

రుణాలను చెల్తిస్తారు. వారు ఎగ్గొట్టినా మహా అయితే వందల కోట్లలో ఉంటుంది. కానీ మాల్యాలాగా వేలకోట్లలో ఉండదు. కానీ బ్యాంకర్లు సామాన్యులకన్నా ఎగవేతదారులకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విధానం పోవాలి. పెద్దపెద్ద కంపెనీలకు వేలకోట్లు ఇచ్చి నష్టపోతున్న బ్యాంకులు సామాన్యులకు లక్షా రెండు లక్షలు ఇవ్వడానికి సవాలక్ష ప్రశ్నలు వేస్తున్నాయి. ఇక గృహ రుణాలు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి. సామాన్యులు ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుకు వెళితే రుణం నేరుగా దక్కదు. తీసుకున్న రుణం పదేళ్ల తరవాత చూసిన అసలులో కొంతయినా తగ్గదు. ఇలాంటి విధానాలు పోవాలి. అయితే అన్ని రుణాలకు ఒకే విధానం ఉండడం కూడా బ్యాంకుల మనుగడకు అడ్డంకిగా మారింది. అలాగే ఎగవేతలకు ఆస్కారంగా ఉంది. జన్‌ధన్‌ కింద కోట్లాది ఖాతాలు తెరిపించామని చెబుతున్నా పేదలు సర్కార్‌పై ఆధారపడకుండా చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే విధంగా స్వయం సమృద్దిని ప్రోత్సహించే విధంగా బ్యాంకు రుణాలు ఉండాలి. వడ్డీరేట్లు తక్కువగా ఉండి రుణాలు సకాలంలో తీర్చగలిగేలా ఉండాలి. కానీ అలా ఆలోచనలు చేయడం లేదు. ఇలాచే/-తే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుఉతంది. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ దిశగా రుఘుమారాజన్‌ చేయడం లేదన్నదని ఎంపి సుబ్రమణ్యస్వామి వాదన. అందుకే ఆయన తప్పుకోవాలని, లేదా తప్పించాలని స్వామి కోరుతున్నారు. సామాన్యులు లేదా మధ్య తరగతి ప్రజలు విరివిడగా రుణాలు పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేలా రుణాలు, వడ్డీలు ఉండాలి. ప్రధానంగా ఇల్లు కనీసం ఒకసారయినా కొనాలనుకునే వారికి వడ్డీ తక్కువలో తక్కువగా ఉంటే మంచిది.చిన్నచిన్న పరిశ్రమలతో స్వయం ఉపాధికి బ్యాంకర్లు ఏనాడు తోడు రావడం లేదు. వీటిని సవిూక్షించి, ఎగవేతదారులకు ముగుతాడువేసే విధంగా ఆర్‌బిఐ పనితీరు ఉంటే మంచిది.